News August 26, 2025
శ్రీరాంపూర్: ‘మట్టి వినాయకులను పూజించాలి’

వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు మట్టి ప్రతిమలకు పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని సంస్థ డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సోమవారం ఉద్యోగులు, అధికారులకు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయక ప్రతిమలను చెరువులు, జలాశయాలలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం కలుగుతుందన్నారు.
Similar News
News August 26, 2025
లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం: DMHO

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని DMHO డా. బి. కళావతి బాయి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 26, 2025
విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.
News August 26, 2025
గుండెలను కలిచివేసే దృశ్యం: KTR

TG: రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతోందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఓ చిత్రాన్ని Xలో షేర్ చేశారు. ‘గుండెలను కలిచివేసే దృశ్యం. విద్యార్థి స్కూల్‌కు వెళ్లకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి. కాంగ్రెస్, BJP ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి. సమయానికి ఎరువులు ఇవ్వకుండా లక్షలాది మందిని అంతులేని లైన్లలో నిలబెట్టాయి. మన రైతులకు గౌరవం దక్కాలి.. ఇబ్బందులు కాదు’ అని విమర్శించారు.