News August 26, 2025

మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం: DMHO

image

జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మల్టిజోన్-1లో MBBSపూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుDMHO కళావతిబాయి తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్‌లో సబ్మిట్ చేసి ఆ తర్వాత పూర్తి వివరాలతో ఆఫ్‌లైన్ దరఖాస్తు ఆఫీస్‌లో ఇవ్వాలని తెలిపారు.
ఈనెల 30లోపు అందజేయాలని సూచించారు.

Similar News

News August 26, 2025

ఖమ్మం: ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ప్రభుత్వ, లోకల్ బాడీ, ఎయిడెడ్, కేజీబీవీ, తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల యాజమాన్యాల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. హెచ్ఎంలకు 15 సంవత్సరాలు, ఉపాధ్యాయులకు 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలన్నారు. ఈ నెల 28 లోగా డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో ధ్రువీకరించి అందజేయాలని సూచించారు.

News August 26, 2025

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం: DMHO

image

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని DMHO డా. బి. కళావతి బాయి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 26, 2025

ఖమ్మం జిల్లాలో డెంగీ పంజా..!

image

ఖమ్మం జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు 113 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నెల 1 నుంచి 24వ తేదీ వరకు మొత్తం 82 కేసులు వెలుగు చూశాయి. ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాచి వడబోసిన నీరు, వేడి పదార్థాలు, పండ్లు తీసుకోవడమే కాక పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.