News August 26, 2025

ఒంగోలు: 24 ఏళ్ల తర్వాత జైలుశిక్ష

image

హనుమంతునిపాడు మండలానికి చెందిన ధనేకుల తిరుపతయ్య 2000వ సంవత్సరం సెప్టెంబర్ 4న బాలిక ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్ తీసుకుని తాగాడు. తర్వాత బాలికను బయటకు పిలిచి నోరు మూసిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. నేరం రుజువు కావడంతో 24 ఏళ్ల తర్వాత ఒంగోలు కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.7వేల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది.

Similar News

News August 26, 2025

పోలీస్ కుటుంబాలకు SP అండ.!

image

ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రిటైర్డ్, మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ మురళి కుటుంబ సభ్యులకు ఇన్సిడెంటల్ చార్జెస్ రూ.25వేల చెక్కును ఎస్పీ అందజేశారు.

News August 26, 2025

30న ఒంగోలులో జాబ్ మేళా.. జీతం ఎంతంటే.!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని ఉపాధి ఆఫీస్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. టాటా ఎలక్ట్రానిక్స్, హీరో మోటో కార్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, రిలయన్స్ జియో ఇన్ఫో కం లిమిటెడ్ వంటి కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. 18 నుంచి 35ఏళ్ల యువతీ యువకులు పాల్గొనాలని, ఎంపికైనవారికి రూ.19500 జీతం ఉంటుందన్నారు.

News August 26, 2025

ప్రకాశం: ఎటు చూసినా జ్వరాలే..!

image

ప్రకాశం జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. చాలా మంది ఒంగోలు రిమ్స్‌కు తరలి వస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.