News April 2, 2024

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలి: బండి

image

TG: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టిన ఆయన.. ‘రైతులను ఆదుకోవాలి. కర్షకులు లేనిదే రాజ్యం లేదు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. పంట ఎండిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి’ అని కోరారు.

Similar News

News March 20, 2026

పాక్-అఫ్గాన్.. సోదరుల్లా ఉండండి: ఖమేనీ

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.

News March 20, 2026

టెన్త్ పరీక్షల రద్దుపై క్లారిటీ

image

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దవుతాయనే ప్రచారంపై విద్యా కమిషన్ OSD డా.జీనత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.

News March 20, 2026

బీసీసీఐ నాపై వివక్ష చూపింది: శివరామకృష్ణన్

image

మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐ కామెంట్రీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘23 ఏళ్లుగా పెద్ద మ్యాచ్‌లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్లకు నన్ను వాడుకోకుండా BCCI వివక్ష చూపింది. నా పాత్రను పరిమితం చేసింది. నా తర్వాత వచ్చిన వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఆత్మ గౌరవాన్ని కోల్పోయి పనిచేయలేను’ అని SMలో పోస్టులు చేశారు.