News August 26, 2025

HYD: హత్య చేసి తాపిగా వెళ్లి సిగరెట్ తాగాడు!

image

HYDలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో కిరాతకుడు మహేందర్‌రెడ్డి చేసిన పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన నెల నుంచే అనుమానం, పంచాయతీలు పెట్టి ఊరందరి ముందు పరువు తీసిందన్న కక్షతో భార్య స్వాతిని చంపి ముక్కలు చేశాడు. అనంతరం ఇంటి దగ్గర పాన్‌షాప్‌కు వెళ్లి ఏమీ జరగనట్లు తాపీగా సిగరెట్ తాగాడని పోలీసులు విచారణలో తేలింది. ఈ పైశాచిక భర్త ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు.

Similar News

News August 26, 2025

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

image

ఈనెల 27- SEP 6 వరకు ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోజూ ఉ.11 నుంచి రద్దీని బట్టి ప్రధాన మార్గాలైన VV స్టాచ్యూ, సైఫాబాద్ పాత PS, నెక్లెస్ రోటరీ వైపుల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామన్నారు. భక్తులు మెట్రో, బస్సులు వంటి ప్రజారవాణాను ఉపయోగించాలాన్నారు. ఐమాక్స్, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.

News August 26, 2025

HYD: అంతర్జాతీయ పోటీల్లో ‘FIRE’ కానిస్టేబుల్

image

HYD అగ్నిమాపక కానిస్టేబుల్ అవుల నరసింహ, ఐసీఎన్ ప్రో కార్డ్ గెలుచుకుని అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు అర్హత సాధించారు. ‘Mr. Fit Cop’గా పేరుగాంచిన నరసింహ, తన వృత్తిని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఘనతతో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసింహను పలువురు అభినందించారు.

News August 26, 2025

ఉత్సవాలకు ముందే.. HYDలో తొలి విగ్రహం నిమజ్జనం

image

వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్‌‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గూడకు చెందిన మండప నిర్వాహకులు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్‌‌నగర్‌‌లో కేబుల్స్‌కు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ఆ విగ్రహాన్ని పీపుల్స్‌ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.