News August 26, 2025
BCCI స్పాన్సర్‌గా TOYOTA?

టీమ్ఇండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు జపాన్ ఆటోమేకర్ టయోటా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కూడా స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు BCCI అధికారిక బిడ్డింగ్ మొదలుపెట్టలేదు. అటు SEP 9న మొదలయ్యే ఆసియా కప్‌లోపు స్పాన్సర్ దొరకడం దాదాపు కష్టమే.
Similar News
News August 26, 2025
ఈ నెల 29న క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 29న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
News August 26, 2025
మహీంద్రా వర్సిటీలో డ్రగ్స్ కలకలం

TG: మేడ్చల్ జిల్లా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపింది. 50 మంది స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసింది. వారి నుంచి 1.15 కేజీల గంజాయి, 47gms ఓజీ వీడ్ స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది.
News August 26, 2025
OP సిందూర్ ముగియలేదు: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, విరామం ఇచ్చామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వైజాగ్‌లో ఉదయగిరి, హిమగిరి వార్ షిప్‌లను మంత్రి జాతికి అంకితమిచ్చారు. ‘2050 నాటికి దేశంలో 200 యుద్ధ నౌకలు నిర్మించనున్నాం. వేర్వేరు చోట్ల రూపొందించిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి జలప్రవేశం చేయించడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకలు మన దేశ ప్రతీకగా నిలుస్తున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.