News August 26, 2025
పెరిగిన గోల్డ్ రేట్స్

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.1,02,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 ఎగబాకి రూ.93,550 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,30,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News August 26, 2025
బట్టలు లేకుండా ట్రిప్!

ప్రపంచంలోనే అతిపెద్ద న్యూడ్ బోట్ ఏటా FEB 9-20 మధ్య USలోని మియామీ నుంచి కరేబియన్ దీవుల చుట్టూ 11 రోజుల పాటు ప్రయాణిస్తుంది. దుస్తుల్లేకుండా ప్రయాణించే వెసులుబాటు ఉండటం దీని ప్రత్యేకత. వినోదం కోసమే కాకుండా, తమ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే భావనను దీనిద్వారా ప్రోత్సహిస్తారు. ప్రయాణికులు రూ.43లక్షలు చెల్లించాలి. బేర్ నెసెసిటీస్ అనే US లోదుస్తుల సంస్థ 1990 నుంచి ఇలాంటి ప్రయాణాలను చేపడుతోంది.
News August 26, 2025
బార్ లైసెన్స్ అప్లికేషన్లు.. 29 వరకు ఛాన్స్

AP: బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వినాయక చవితి, బ్యాంకు సెలవుల దృష్ట్యా గడువు పొడిగించినట్లు తెలిపింది. గడువు పెంపుపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. బార్ లైసెన్సులకు ఈ నెల 30న ఉ. 8 గం.కు లాటరీ తీయనున్నారు. కాగా బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరనే నిబంధనలతో తక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.
News August 26, 2025
50% సుంకాలు.. భారత్‌కు ఎంత నష్టమంటే?

అమెరికా విధించిన 50% <<17519222>>సుంకాలు<<>> ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి USకు $60.2 బిలియన్ల విలువైన సరుకులు ఎగుమతి అవుతుండగా అవి $18.6 బిలియన్లకు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని, GDP 0.2-0.5% తగ్గే అవకాశం ఉందన్నారు. టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్, ఆటోమొబైల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.