News August 26, 2025
బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు.
Similar News
News August 26, 2025
ASF: పూలాజీ బాబా జయంతి ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. మంగళవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ఖష్బూగుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన జైనూర్ మండలం పట్నాపూర్‌లోని పూలాజీ బాబా సంస్థాన్‌లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
News August 26, 2025
ఈనెల 28నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు: SP

కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారికి ఈనెల 28 నుంచి కైలాసగిరి ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వైద్య పరీక్షలు జరుగుతాయని SP తుహీన్ సిన్హా తెలిపారు. హాల్ టికెట్ నంబర్ 4001020 నుంచి 4152205 వరకు గల అభ్యర్థులు 28న, 4152904-4275272 వరకు గల అభ్యర్థులు 29న హాజరు కావాలన్నారు. అలాగే 4276418-4507457 వరకు గల అభ్యర్థులు ఈనెల 30న రావాలన్నారు. ఆయా రోజుల్లో హాజరు కాలేని వారు సెప్టెంబర్ 1న హాజరు కావాలన్నారు. >Share it
News August 26, 2025
వికారాబాద్ జిల్లా న్యాయవాదుల నిరసన

వికారాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. నిన్న కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఈసీ సభ్యుడు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్‌పై కొంతమంది దుండగులు దాడి చేసిన ఘటనకు నిరసనగా, ఈరోజు వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.