News August 26, 2025

ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

image

TG: ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 5 రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం.

Similar News

News August 26, 2025

టీమ్ ఇండియా క్రికెటర్లకు రూ.200 కోట్ల నష్టం!

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు రూ.150-200 కోట్లు నష్టపోనున్నారు. డ్రీమ్ 11కు రోహిత్, బుమ్రా, హార్దిక్, కృనాల్, మై 11 సర్కిల్‌కు సిరాజ్, గిల్, జైస్వాల్, MPLకు కోహ్లీ, విన్‌జోకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందుకు గానూ వీరంతా కలిపి ఏడాదికి రూ.150-200 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ రద్దు కావడంతో వీరికి ఆ మొత్తం నష్టంగా మారనుంది.

News August 26, 2025

పంచాయతీ ఎన్నికలు.. SEC ఆదేశాలు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్‌డేట్ ఇచ్చింది. SEP 2 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితా ప్రిపేర్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న జిల్లా స్థాయి సమావేశం, 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆగస్టు 28-30 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 31న వాటిని పరిష్కరించాలని పేర్కొంది.

News August 26, 2025

ముంతాజ్ హోటల్‌కు వేరే చోట 25 ఎకరాలు: TTD

image

AP: TTD భూములను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు <<17505077>>YCP<<>> దుష్ప్రచారం చేస్తోందని ఛైర్మన్ BR.నాయుడు మండిపడ్డారు. ‘ఏడు కొండలను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్‌కు కేటాయించి YCP తప్పు చేసింది. తిరుమలలో ఆ హోటల్ నిర్మాణం సరికాదని యాజమాన్యానికి CM CBN చెప్పారు. వేరే చోట 25 ఎకరాలు ఇస్తామని ఒప్పించారు’ అని పేర్కొన్నారు. కాగా హోటల్‌ నిర్మాణంపై పలువురు స్వామీజీలు అభ్యంతరం తెలిపారు.