News April 2, 2024
HYD: రేషన్‌కార్డు ఉందా.. ఇది మీ కోసమే..!

HYDలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక లాంటి అనేక ప్రాంతాల్లో సోమవారం నుంచే రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెర లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ప్రతి నెల 7వ తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో సరుకు కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న పౌరసరఫరాల శాఖ 1వ తేదీ నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది.
Similar News
News April 20, 2025
HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.
News April 20, 2025
HYD: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16,305 మంది విద్యార్థులు 73 కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీసులను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News April 20, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.