News August 26, 2025
వాన్‌పిక్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

AP మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో CBI ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలని వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను TG హైకోర్టు కొట్టేసింది. 2022 JULలో వాన్‌పిక్ ప్రాజెక్టు పిటిషన్‌ను హైకోర్టు అనుమతించగా తమ వాదనలు పట్టించుకోకుండా ఉత్తర్వులు ఇచ్చిందంటూ CBI సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో మరోసారి విచారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.
Similar News
News August 26, 2025
కాబోయే భార్యతో భారత క్రికెటర్.. ఫొటో వైరల్

టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కాబోయే భార్య వన్శికతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కుల్దీప్ బ్లాక్ సూట్‌లో, వన్శిక వైట్ గౌన్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరికి జూన్ 4న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. లక్నోకు చెందిన వన్శిక LICలో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది.
News August 26, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణేశ్ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.
News August 26, 2025
టీమ్ ఇండియా క్రికెటర్లకు రూ.200 కోట్ల నష్టం!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు రూ.150-200 కోట్లు నష్టపోనున్నారు. డ్రీమ్ 11కు రోహిత్, బుమ్రా, హార్దిక్, కృనాల్, మై 11 సర్కిల్‌కు సిరాజ్, గిల్, జైస్వాల్, MPLకు కోహ్లీ, విన్‌జోకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందుకు గానూ వీరంతా కలిపి ఏడాదికి రూ.150-200 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ రద్దు కావడంతో వీరికి ఆ మొత్తం నష్టంగా మారనుంది.