News August 26, 2025

KMR: డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది 7 నెలల్లోనే 6,800 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు. తాజాగా AUG 22న కోర్టు 91 మందికి శిక్షలు వేసింది. వీరిలో 16 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన 74 మందికి రూ. 1,100 చొప్పున జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Similar News

News August 26, 2025

VKB: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: అ.కలెక్టర్

image

రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లు జిల్లా వ్యవసాయ అధికారులతో అదనపు కలెక్టర్ యూరియా ఎరువులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వారంలోగా ఒక వెయ్యి 80 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని రైతులు అప్పటివరకు నానో యూరియా వాడాలన్నారు. రైతులకు యూరియా ఎరువులు వాడకంపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

News August 26, 2025

ముగిసిన టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ

image

TG: రాష్ట్రంలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. 4,454 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ లభించింది. 880 మంది స్కూల్ అసిస్టెంట్స్‌, 811 మంది SGTలకు హెడ్ మాస్టర్లుగా, 2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

News August 26, 2025

జనగామ: వృద్ధుడిని ఢీకొన్న కలెక్టర్ ఎస్కార్ట్ వాహనం

image

జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. తరిగొప్పుల నుంచి జనగామకు వస్తుండగా సిద్దిపేట మెయిన్ రోడ్డులో జనగామ మండలం పెద్దరామచర్లకు చెందిన నాయన బిక్షపతి డివైడర్ పక్క నుంచి సడన్‌గా వచ్చాడు. దీంతో కలెక్టర్ ఎస్కార్టు వాహనం ఢీకొట్టడంతో తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు.