News April 2, 2024
MBNR: విపరీతమైన ఎండలు.. వైద్యుల సూచనలు

✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.
Similar News
News April 21, 2025
MBNR: ‘విద్యా వ్యవస్థను బలోపితం చేస్తాం’

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యావ్యవస్థను బలోపితం చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. బీటీఏ నేత బాల పీరు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలైన బదిలీలు, ప్రమోషన్స్, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
News April 20, 2025
MBNR: 22ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్‌లో 2002-2003 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, గురువులకు మెమెంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణవర్ధన్ గౌడ్, కేశవర్ధన్ గౌడ్, రాజేష్, నరేందర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
News April 20, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

✔SLBC: డేంజర్ జోన్‌లో ఆరుగురు✔పలుచోట్ల చలివేంద్రాలు ప్రారంభం✔MBNR:కరెంట్ షాక్‌తో స్తంభంపైనే మృతి✔గద్వాల: రేపు వక్ఫ్‌బోర్డు చట్టం సవరణకు వ్యతిరేకంగా ర్యాలీ✔ఓపెన్ SSC, INTER ఎగ్జామ్స్ ప్రారంభం✔పలుచోట్ల ఈదురు గాలుల బీభత్సం✔తడిసిన ధాన్యం కొంటాం.. భయపడొద్దు: ఎమ్మెల్యేలు✔హామీల అమలులో కాంగ్రెస్ విఫలం:BRS ✔మహమ్మదాబాద్: ఆటో, టిప్పర్ ఢీకొని ఒకరు మృతి✔PUలో ఘనంగా వీడ్కోలు సమావేశం