News August 26, 2025

సంగారెడ్డి: ‘పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి’

image

సంగారెడ్డి జిల్లాలో 190 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు వెంటనే వారికి కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాలని సూచించారు. పొద్దున్నతి పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

Similar News

News August 26, 2025

అనకాపల్లి: దరఖాస్తు చేసుకునే గడువు పెంపు

image

జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్‌ తెలిపారు. ఆసక్తి గలవారు రూ.5 లక్షల నాన్ రెఫండబుల్ దరఖాస్తు రుసుము, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలన్నారు. 30న కలెక్టరేట్లో డ్రా ద్వారా బార్లు కేటాయించడం జరుగుతుందన్నారు.

News August 26, 2025

ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న ఎంపీ కావ్య

image

బీహార్ రాష్ట్రంలోని సుపాల్‌లో నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ కావ్య పాల్గొన్నారు. బీహార్‌లో నితీశ్ కుమార్-బీజేపీ పాలనతో ప్రజలు విసిగి పోయారన్నారు. ఉద్యోగాలు లేక, వలసలు పెరిగాయని, ప్రజలు ఇండియా కూటమి వైపు చూస్తున్నారని ఎంపీ అన్నారు.

News August 26, 2025

పాడేరు: ‘ఈనెల 30లోగా అభ్యంతరాలు తెలపాలి’

image

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో 244 పారా మెడికల్, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి ముందుగా 19పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ డీ.హేమలతదేవి మంగళవారం తెలిపారు. నేడు 18 క్యాడర్లకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ విడుదల చేశామన్నారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీలోగా తమ అభ్యంతరాలను నేరుగా కానీ, ఈ మెయిల్ ద్వారా కానీ తెలపవచ్చన్నారు.