News August 26, 2025
పార్వతీపురం: ‘స్థలాలు గుర్తించి గ్రౌండింగ్ చేయండి’

జిల్లాలో పరిపాలన ఆమోదం పొందని పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పంచాయతీ రాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు. పార్వతీపురం జిల్లాకు 80 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా, 68 భవనాలకు పరిపాలన ఆమోదం మంజూరు చేశామన్నారు. మంగళవారం లోగా స్థలాలను గుర్తించి పరిపాలన ఆమోదం పొందాలని స్పష్టం చేశారు.
Similar News
News August 26, 2025
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ జానకి షర్మిల

బుధవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రులకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని SP జానకి షర్మిల అధికారులను ఆదేశించారు. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు
News August 26, 2025
కర్లపాలెం అంగన్వాడీ కేంద్రం పని తీరుపై కలెక్టర్ అసహనం

అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో పాటు విద్యా బోధన జరగాలని కలెక్టర్ వెంకట మురళి సూచించారు. కర్లపాలెం మండలం కర్లపాలెం ఎంఎన్ రాజుపాలెంలోని కోడ్ నంబర్-128 అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీ స్కూల్ నిర్వహణపై ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్త అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సరిగా స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులకు బాల్యం నుంచే విద్యాబుద్ధులు నేర్పాలన్నారు.
News August 26, 2025
కడప: ‘బార్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు’

కడప జిల్లాలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 29వ తేది వరకు పొడిగించినట్లు జిల్లా ప్రాహిబిషన్ & ఎక్సైజ్ అధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2లో కలిపి మొత్తం 29 బార్ల ఏర్పాటుకు అధికారులు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు.