News August 26, 2025
గుండెలను కలిచివేసే దృశ్యం: KTR

TG: రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతోందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఓ చిత్రాన్ని Xలో షేర్ చేశారు. ‘గుండెలను కలిచివేసే దృశ్యం. విద్యార్థి స్కూల్‌కు వెళ్లకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి. కాంగ్రెస్, BJP ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి. సమయానికి ఎరువులు ఇవ్వకుండా లక్షలాది మందిని అంతులేని లైన్లలో నిలబెట్టాయి. మన రైతులకు గౌరవం దక్కాలి.. ఇబ్బందులు కాదు’ అని విమర్శించారు.
Similar News
News August 26, 2025
పేర్ని నానిపై మరో కేసు నమోదు

AP: వైసీపీ నేత పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఏలూరు త్రీ టౌన్ పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల దెందులూరు పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్వామిభక్తితో పనిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.
News August 26, 2025
రేపు చంద్రుడిని చూస్తే ఏమవుతుందో తెలుసా?

గణేశుడు కడుపునిండా తిని తన తల్లిదండ్రులకు నమస్కారం చేస్తుండగా కిందపడతాడు. కడుపులోని ఉండ్రాళ్లన్నీ బయటపడటంతో చంద్రుడు నవ్వుతాడు. పార్వతి కోపంతో చంద్రుడిని చూసిన వారు నీలాపనిందలకు గురవుతారని శాపం పెడుతుంది. చంద్రుడు తప్పు తెలుసుకోవడంతో దాన్ని భాద్రపద శుద్ధ చవితికి పరిమితం చేస్తుంది. వినాయక చవితి నాడు పొరపాటున చంద్రుడిని చూస్తే గణేశుడి కథ విని, అక్షతలు తలపై వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
News August 26, 2025
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై కలెక్టర్‌కు NCSC నోటీసులు

AP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో తమను ఓటు వేయనివ్వలేదని, తమ ఓటు హక్కును వేరే వాళ్లు వినియోగించుకున్నారని అచ్చవెల్లి, ఎర్రబల్లి గ్రామస్థులు NCSCకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఆరోపణలపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.