News August 26, 2025
విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.
Similar News
News August 26, 2025
VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.
News August 26, 2025
విజయనగరం: కరుస్తున్నాయి.. కాటేస్తున్నాయి..!

జిల్లాలో పాము కాట్లు, కుక్కల దాడులు భయాందోళన రేపుతున్నాయి. 2024లో 383 మంది పాముకాటుకు గురికాగా ఇద్దరు మరణించారు. 2025 (ఆగస్టు వరకు) 143 కేసులు నమోదయ్యాయి. 2024లో 12,767 కుక్క కాటు కేసులు నమోదవ్వగా నలుగురు చనిపోయారు. 2025 (ఆగస్టు వరకు) 7,545 కేసులు నమోదవ్వగా ఆరుగురు ప్రాణాలొదిలారు. కుక్క, పాముకాట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబీస్, యాంటీ వెనమ్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.
News August 26, 2025
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిషా, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో, ముఖ్యంగా నాగావళి పరీవాహక మండలాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్.కోట, నెల్లిమర్ల మండలాల్లో రేపు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.