News August 26, 2025
IPS అధికారి సంజయ్‌కి రిమాండ్

AP: IPS అధికారి సంజయ్‌కి విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసిన సమయంలో, సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు నిధుల మంజూరులో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయగా సంజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ముందస్తు బెయిల్ దొరక్కపోవడంతో ఇటీవల ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
Similar News
News August 26, 2025
గణపతికి ప్రీతికరమైన వంటకాలు ఇవే..!

సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతా లక్షణ సమన్వితుడు వినాయకుడు. ఈ జగత్తులో తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన వంటకాలు ఉన్నాయి. వీటిలో ఉండ్రాళ్లు, మోతీచూర్ లడ్డూ, రవ్వ లడ్డూ, చిట్టిముత్యాల లడ్డూ, రవ్వ పూర్ణాలు, పాయసం, రవ్వ పొంగల్, కొబ్బరి అన్నం, కరంజి, పురాస్ పోలీ వంటి వంటకాలను గణేశుడికి సమర్పించవచ్చు. గణపతి వీటిని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషిస్తారని ప్రతీతి.
News August 26, 2025
ALERT: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News August 26, 2025
పేర్ని నానిపై మరో కేసు నమోదు

AP: వైసీపీ నేత పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఏలూరు త్రీ టౌన్ పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల దెందులూరు పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్వామిభక్తితో పనిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.