News August 26, 2025
విశాఖ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

తూర్పు నౌకాదళంలో 2 యుద్ధ నౌకలు ప్రారంభించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, సీపీ శంఖబ్రత బాగ్చీ, నేవీ తూర్పు నౌకదళ ప్రధాని అధికారి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడికి చేరుకొని 2 యుద్ధ నౌకలను మంత్రి ప్రారంభిస్తారు.
Similar News
News August 27, 2025
GVMC పరిధిలో రూ.1,015 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు

GVMC పరిధిలో రూ.1015 కోట్ల అభివృద్ధి పనులకు అక్టోబరులోగా టెండర్లు పిలవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదేశించారు. అమరావతిలో మంగళవారం జీవీఎంసీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలన్నారు.మూడునాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు పాల్గొన్నారు.
News August 26, 2025
విశాఖలో C.M. పర్యటన ఖరారు

C.M.చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.
News August 26, 2025
డీఎస్సీలో విశాఖ జిల్లా టాపర్‌గా శ్రావణి

మెగా డీఎస్సీ 2025లో మరడాన శ్రావణి 86 మార్కులతో(ఎస్ఏ) విశాఖ జిల్లా టాపర్‌గా నిలిచింది. జోన్-1మోడల్ స్కూల్ టీజీటీ ఇంగ్లీష్ 78 మార్కులతో 15వ ర్యాంకు సాధించి రెండు పోస్టులకు ఎంపికయింది. ఈమె ప్రాథమిక, ఉన్నత విద్య శ్రీహరిపురం, కళాశాల విద్య గాజువాకలోను అభ్యసించింది. గతంలో గ్రామ సచివాలయం ఉద్యోగం వచ్చినా వదులుకొని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించింది.