News August 26, 2025

పెళ్లైన 30ఏళ్లకు ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య!

image

TG: నిర్మల్ జిల్లా వెల్మల్‌లో హరిచరణ్‌ను భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు మహేశ్ కలిసి హత్య చేశారు. గొంతుకు టవల్ బిగించి చంపేశారు. బాత్రూమ్‌లో మూర్ఛతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. తల్లిపై అనుమానంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. హరిచరణ్, నాగలక్ష్మికి 30 ఏళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు.

Similar News

News August 26, 2025

భూమన తీవ్ర ఆరోపణలు.. ఆ IAS ఎవరు?

image

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ IAS అధికారిణిపై చేసిన <<17523215>>కామెంట్స్<<>> చర్చనీయాంశంగా మారాయి. ఆమె అవినీతిలో అనకొండలాంటిదని, TDR బాండ్ల ద్వారా రూ.వందల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. రోజూ ధరించే చీర రూ.లక్షన్నర అని, రూ.50 లక్షల కంటే విలువైన విగ్గులు ఆమెకు 11 ఉన్నాయని వ్యక్తిగతంగానూ విమర్శించారు. రోజుకో విగ్గుతో దర్శనమిస్తారన్నారు. అయితే ఆ అధికారిణి పేరు మాత్రం వెల్లడించలేదు.

News August 26, 2025

ఆ హీరోయిన్ అంటే మా నాన్నకు ఇష్టం: శ్రుతి హాసన్

image

బెంగాలీ నటి అపర్ణ సేన్ అంటే తన తండ్రి కమల్ హాసన్‌కు ఇష్టం ఉండేదని శృతిహాసన్ తెలిపారు. ‘నాన్న బెంగాలీలో ఒక సినిమా చేశారు. ఆ సమయంలో అపర్ణ సేన్‌తో ప్రేమలో పడ్డారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నారు. నాన్న డైరెక్ట్ చేసిన “హే రామ్” మూవీలో హీరోయిన్ పాత్ర పేరును కూడా అందుకే అపర్ణ సేన్‌గా మార్చారు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అపర్ణ సేన్ 9 జాతీయ అవార్డులు, 1987లో పద్మశ్రీ అందుకున్నారు.

News August 26, 2025

ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీలు.. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ

image

TG: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 48,630 సీట్లను పాఠశాల విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనుంది. 6thలో 7,543, 7thలో 5,192, 8thలో 3,936, 9thలో 2,884, 10thలో 3,151, ఇంటర్ సెకండియర్‌లో 13,256, ఫస్టియర్‌లో 12,668 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించగా, మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేయనుంది. సీట్ల కోసం స్కూళ్లలో సంప్రదించాలి.