News August 26, 2025
రోహిత్‌ను తప్పించేందుకే బ్రాంకో టెస్ట్: తివారీ

2027 ODI WC నుంచి రోహిత్‌ను తప్పించేందుకే BCCI బ్రాంకో టెస్టును ప్రవేశపెడుతోందని మనోజ్ తివారీ ఆరోపించారు. ‘బ్రాంకో టెస్ట్ చాలా టఫ్. ఇందులో కోహ్లీ అర్హత సాధిస్తారు. కానీ రోహిత్‌తోపాటు మరికొందరికి కష్టమే. 2011WC తర్వాత యోయో పేరుతో యువీ, గౌతీ, సెహ్వాగ్‌ను పక్కనబెట్టినట్లే ఇప్పుడు కొందరిని తప్పించబోతున్నారు’ అని తెలిపారు. బ్రాంకో టెస్టులో ప్లేయర్ 6 నిమిషాల్లోనే 1,200 మీటర్లు పెరిగెత్తాల్సి ఉంటుంది.
Similar News
News August 26, 2025
ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీలు.. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ

TG: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 48,630 సీట్లను పాఠశాల విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనుంది. 6thలో 7,543, 7thలో 5,192, 8thలో 3,936, 9thలో 2,884, 10thలో 3,151, ఇంటర్ సెకండియర్‌లో 13,256, ఫస్టియర్‌లో 12,668 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించగా, మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేయనుంది. సీట్ల కోసం స్కూళ్లలో సంప్రదించాలి.
News August 26, 2025
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు అనుమతి

TG: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. 2020 OCT 12 నుంచి NOV 10 వరకు స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అంగీకారం తెలిపింది. 2020 OCTలో అప్పటి ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు GO ఇవ్వగా, నెల రోజులకే కోర్టు స్టే విధించింది. చట్టంలో అవకాశం లేకుండా ఎలా రెగ్యులరైజ్ చేస్తారని ప్రశ్నించింది. ‘భూ భారతి’ చట్టంలో సాదాబైనామాల రెగ్యులరైజేషన్ అంశం పొందుపరచడంతో అనుమతి లభించింది.
News August 26, 2025
గణపతికి ప్రీతికరమైన వంటకాలు ఇవే..!

సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతా లక్షణ సమన్వితుడు వినాయకుడు. ఈ జగత్తులో తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన వంటకాలు ఉన్నాయి. వీటిలో ఉండ్రాళ్లు, మోతీచూర్ లడ్డూ, రవ్వ లడ్డూ, చిట్టిముత్యాల లడ్డూ, రవ్వ పూర్ణాలు, పాయసం, రవ్వ పొంగల్, కొబ్బరి అన్నం, కరంజి, పురాస్ పోలీ వంటి వంటకాలను గణేశుడికి సమర్పించవచ్చు. గణపతి వీటిని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషిస్తారని ప్రతీతి.