News August 26, 2025

డ్రైవింగ్ సేఫ్టీపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ అవగాహన

image

డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది. అధికారిక ఫేస్‌బుక్ పేజీలో డ్రైవింగ్ సేఫ్టీకి సంబంధించిన అవగాహన పోస్టర్‌ను అప్‌లోడ్ చేశారు. ప్రయాణం చేస్తున్నప్పుడు దృష్టి పూర్తిగా డ్రైవింగ్‌పైనే కేంద్రీకరించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దన్నారు. చుట్టూ ఉన్న ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News August 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో రాబోయే కొన్ని రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు మరియు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News August 26, 2025

కొత్తవలసలో అత్యధిక వర్షపాతం

image

మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు విజయనగరం డివిజన్లో అత్యధికంగా కొత్తవలసలో65.8mm(క్యూములేటివ్) వర్షపాతం కురిసినట్లు ఏఎస్‌ఓ రామకృష్ణ రాజు తెలిపారు. నెల్లిమర్లలో 61.2mm, జామిలో 55.2mm, విజయనగరంలో 50.8mm, భోగాపురంలో 48.8mm, పూసపాటిరేగలో 48.2mm, డెంకాడలో 45.6mm, ఎస్.కోటలో 37.8mm, ఎల్.కోటలో 29.2mm, వేపాడలో 26.2mm, బొండపల్లిలో 19.4 mm వర్షపాతం నమోదు అయిందని తెలిపారు.

News August 26, 2025

కొల్లిపర: అత్తోటలో దారుణం.. మహిళపై దాడి చేసి దోపిడి

image

కొల్లిపర మండలం అత్తోటలో మంగళవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ అనే మహిళపై దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. మహిళ ప్రతిఘటించడంతో తలపై దాడి చేసిన ఇద్దరు దుండగులు 16 సవర్ల 8 బంగారు చేతి గాజులు లాక్కుని పరారయ్యారు. దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా తెనాలిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొల్లిపర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.