News August 26, 2025
చైన్ స్నాచర్ ఆటకట్టించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేయూసీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.23 లక్షల 50 వేల విలువైన 237 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News August 26, 2025
కొత్తవలసలో అత్యధిక వర్షపాతం

మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు విజయనగరం డివిజన్లో అత్యధికంగా కొత్తవలసలో65.8mm(క్యూములేటివ్) వర్షపాతం కురిసినట్లు ఏఎస్‌ఓ రామకృష్ణ రాజు తెలిపారు. నెల్లిమర్లలో 61.2mm, జామిలో 55.2mm, విజయనగరంలో 50.8mm, భోగాపురంలో 48.8mm, పూసపాటిరేగలో 48.2mm, డెంకాడలో 45.6mm, ఎస్.కోటలో 37.8mm, ఎల్.కోటలో 29.2mm, వేపాడలో 26.2mm, బొండపల్లిలో 19.4 mm వర్షపాతం నమోదు అయిందని తెలిపారు.
News August 26, 2025
కొల్లిపర: అత్తోటలో దారుణం.. మహిళపై దాడి చేసి దోపిడి

కొల్లిపర మండలం అత్తోటలో మంగళవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ అనే మహిళపై దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. మహిళ ప్రతిఘటించడంతో తలపై దాడి చేసిన ఇద్దరు దుండగులు 16 సవర్ల 8 బంగారు చేతి గాజులు లాక్కుని పరారయ్యారు. దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా తెనాలిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొల్లిపర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 26, 2025
భూమన తీవ్ర ఆరోపణలు.. ఆ IAS ఎవరు?

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ IAS అధికారిణిపై చేసిన <<17523215>>కామెంట్స్<<>> చర్చనీయాంశంగా మారాయి. ఆమె అవినీతిలో అనకొండలాంటిదని, TDR బాండ్ల ద్వారా రూ.వందల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. రోజూ ధరించే చీర రూ.లక్షన్నర అని, రూ.50 లక్షల కంటే విలువైన విగ్గులు ఆమెకు 11 ఉన్నాయని వ్యక్తిగతంగానూ విమర్శించారు. రోజుకో విగ్గుతో దర్శనమిస్తారన్నారు. అయితే ఆ అధికారిణి పేరు మాత్రం వెల్లడించలేదు.