News August 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నేటితో పాటు.. రానున్న కొద్దిరోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో ప్రజలు లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, వాగుల వద్దకు వెళ్లవదన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.
Similar News
News August 27, 2025
పెద్దపల్లి: క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చర్యలు: దీపక్ జాన్

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పాస్టర్లతో సమావేశం నిర్వహించి, చర్చి నిర్మాణ అనుమతులు, బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువపత్రాలు, క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన వినతులను పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుతోపాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.
News August 27, 2025
చైనా పట్ల ట్రంప్ డబుల్ యాక్షన్!

చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ వైపు 200% టారిఫ్స్ వడ్డిస్తామంటూనే మరోవైపు 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను చదువుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. కాగా ఇటీవల భారత్, చైనా పట్ల యూఎస్ కఠిన వైఖరి ప్రదర్శించింది. ఇంతలో మళ్లీ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
News August 27, 2025
కరీంనగర్: ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీలో 2024-25 ఆర్థిక సం.కి సంబంధించి 4వ త్రైమాసికంలో, 2025-26 ఆర్థిక సం.మొదటి త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రెండు త్రైమాసికాలకు గాను 57మంది ఉద్యోగులు, 2 బస్ స్టేషన్లకు అవార్డులు ప్రదానం చేశారు. KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం ఉద్యోగులకు అవార్డులు అందించారు.