News August 26, 2025
బార్ లైసెన్స్ అప్లికేషన్లు.. 29 వరకు ఛాన్స్

AP: బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వినాయక చవితి, బ్యాంకు సెలవుల దృష్ట్యా గడువు పొడిగించినట్లు తెలిపింది. గడువు పెంపుపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. బార్ లైసెన్సులకు ఈ నెల 30న ఉ. 8 గం.కు లాటరీ తీయనున్నారు. కాగా బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరనే నిబంధనలతో తక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.
Similar News
News August 27, 2025
‘త్రిపుర’కు ఆడనున్న విహారి.. YCP ప్రశ్నలు!

దేశవాళీ క్రికెట్‌లో ఇక నుంచి తాను త్రిపుర జట్టుకు ఆడబోతున్నట్లు AP క్రికెటర్ హనుమ విహారి ప్రకటించారు. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నా ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతించే వేదిక కోసమే ఈ మార్పు’ అని పేర్కొన్నారు. దీనిపై YCP స్పందిస్తూ ‘గతంలో YCP ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విహారి ఇప్పుడెందుకు విసుగు చెందాడు? అతనికి ఎవరు అవకాశాలివ్వట్లేదు?’ అని ప్రశ్నించింది.
News August 27, 2025
చైనా పట్ల ట్రంప్ డబుల్ యాక్షన్!

చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ వైపు 200% టారిఫ్స్ వడ్డిస్తామంటూనే మరోవైపు 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను చదువుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. కాగా ఇటీవల భారత్, చైనా పట్ల యూఎస్ కఠిన వైఖరి ప్రదర్శించింది. ఇంతలో మళ్లీ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
News August 27, 2025
క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 29న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఈనెల 30కి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మ.ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.