News August 26, 2025

ఈనెల 28నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు: SP

image

కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారికి ఈనెల 28 నుంచి కైలాసగిరి ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వైద్య పరీక్షలు జరుగుతాయని SP తుహీన్ సిన్హా తెలిపారు. హాల్ టికెట్ నంబర్ 4001020 నుంచి 4152205 వరకు గల అభ్యర్థులు 28న, 4152904-4275272 వరకు గల అభ్యర్థులు 29న హాజరు కావాలన్నారు. అలాగే 4276418-4507457 వరకు గల అభ్యర్థులు ఈనెల 30న రావాలన్నారు. ఆయా రోజుల్లో హాజరు కాలేని వారు సెప్టెంబర్ 1న హాజరు కావాలన్నారు. >Share it

Similar News

News August 27, 2025

చవితి వేడుకలకు పటిష్ట బందోబస్తు: SP

image

వినాయక చవితిని ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలని SP కృష్ణ కాంత్ ప్రజలకు సూచించారు. పోలీస్ శాఖ సూచనలు, ఆదేశాలు తప్పని సరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.

News August 27, 2025

PM సూర్యఘర్‌లో జిల్లాకు 8వ స్థానం: JC

image

సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్‌ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.

News August 27, 2025

అన్ని సదుపాయాలతో పీహెచ్సీలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపిఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పీహెచ్సీల ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సకల సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేలా ఆసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు. పనులపురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు నివేదించాలని ఆదేశించారు.