News April 2, 2024
కట్నంలో ‘ఫార్చునర్’ లేదని కొట్టి చంపాడు..
UPలోని నోయిడాలో ఘోరం జరిగింది. కరిష్మాకు వికాస్‌తో 2022లో పెళ్లయింది. అప్పుడు రూ.11లక్షల బంగారం, ఓ SUV కారు కట్నం ఇచ్చారు. అవి చాలవని భావించిన వికాస్ అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఓ కూతురు పుట్టాక వేధింపులు రెట్టింపయ్యాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ.10లక్షలిచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. ఫార్చునర్ కారు, రూ.21లక్షల నగదు ఇవ్వాలని ఆమెను కొట్టి చంపాడు. కేసు నమోదైంది.
Similar News
News November 8, 2024
నోట్ల రద్దుకు 8 ఏళ్లు
కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్‌లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
News November 8, 2024
Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగితే సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్‌లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5
News November 8, 2024
తిరుమలను UTగా చేయాలన్న కేఏ పాల్ పిటిషన్ డిస్మిస్
AP: లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశంలో రాజకీయం నడుస్తోందని, దేశ ప్రతిష్ఠను కాపాడటానికి పిల్ వేశానని పాల్ పేర్కొన్నారు. దీనిప్రకారం అన్ని ఆలయాలు, గురుద్వారాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆదేశించామని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది.