News August 26, 2025

మట్టి విగ్రహాలనే పూజించాలి: కలెక్టర్

image

ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గణేష్ మట్టి విగ్రహాల పోస్టర్‌ను కలెక్టర్ దివాకర్ టిఎస్ మంగళవారం ఆవిష్కరించారు. మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు. కృత్రిమ పదార్థాలు, రసాయనాలతో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను పూజించడం వల్ల గాలి, నేల, జల కాలుష్యం జరుగుతుందన్నారు. 8 అంగుళాల మట్టి గణపతి విగ్రహాలను వినియోగించే విధంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తుందన్నారు.

Similar News

News August 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 27, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు ✒ ఇష: రాత్రి 7.48 గంటలకు ✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 27, 2025

చవితి వేడుకలకు పటిష్ట బందోబస్తు: SP

image

వినాయక చవితిని ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలని SP కృష్ణ కాంత్ ప్రజలకు సూచించారు. పోలీస్ శాఖ సూచనలు, ఆదేశాలు తప్పని సరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.

News August 27, 2025

PM సూర్యఘర్‌లో జిల్లాకు 8వ స్థానం: JC

image

సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్‌ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.