News August 26, 2025

తాడేపల్లి: ‘ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు’

image

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా MEPMA మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఐఏఎస్ మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో పర్యావరణంలో కలిసిపోయే బాటిల్స్, కంపోస్టబుల్ ఎరువులు తయారికి అవసరమయ్యే కర్మాగారాలను నెలకొల్పడంలో ఈ సంస్థలు సహకారం అందిస్తుందన్నారు.

Similar News

News August 27, 2025

బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే భవిష్యత్: ఎస్పీ

image

విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలిగితేనే భవిష్యత్ బంగారుమయం అవుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరు కిట్స్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగంపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవరాదని సూచించారు. ర్యాగింగ్, డ్రగ్స్ వాడకం జీవితాలను నాశనం చేస్తాయని, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

News August 26, 2025

కొల్లిపర: అత్తోటలో దారుణం.. మహిళపై దాడి చేసి దోపిడి

image

కొల్లిపర మండలం అత్తోటలో మంగళవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బొల్లిముంత బుల్లెమ్మ అనే మహిళపై దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. మహిళ ప్రతిఘటించడంతో తలపై దాడి చేసిన ఇద్దరు దుండగులు 16 సవర్ల 8 బంగారు చేతి గాజులు లాక్కుని పరారయ్యారు. దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా తెనాలిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొల్లిపర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 26, 2025

ఓటరు దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష

image

ఓటరు దరఖాస్తులను మరింత మెరుగ్గా పరిష్కరించే విధానాలపై బూత్ లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 35.ca మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆమె చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలు వెల్లడించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.