News August 26, 2025

జగిత్యాల రూరల్: సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

image

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్‌ను, పరిసరాలను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్‌ఫర్‌మేషన్ బుక్, క్రైం రికార్డు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల్లో ఉన్న సీడీ ఫైల్స్‌పై అడిగి తెలుసుకున్నారు.

Similar News

News August 27, 2025

KMR: ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. జిల్లాలోని ఆరు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 27, 2025

ఆగస్టు 27: చరిత్రలో ఈ రోజు

image

1908: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం(ఫొటోలో)
1957: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జననం.
1963: నటి సుమలత జననం.
1972: రెజ్లర్ గ్రేట్ ఖలీ జననం.
2010: తెలుగు వైద్యుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం

News August 27, 2025

నెలాఖరున రోహిత్, రాహుల్‌‌కు యోయో టెస్ట్?

image

ఈ నెల 30-31 తేదీల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఆ రోజుల్లో వారు యోయో టెస్ట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టును క్లియర్ చేసేందుకు ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. కాగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం బీసీసీఐ యో యో టెస్ట్ నిర్వహిస్తోంది. ఆటగాళ్లను మరింత ఫిట్, స్ట్రాంగ్‌గా ఉంచేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.