News April 2, 2024
ఔరా.. మూడేళ్లలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు!
TG: సూర్యాపేట(D) నేరేడుచర్లకు చెందిన మధుసూదన్ 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. B.Tech పూర్తి చేసిన ఇతను మూడేళ్ల వ్యవధిలో పలు బ్యాంకుల్లో క్లరికల్, PO, మేనేజర్ వంటి హోదాల్లో 15 కొలువులు సాధించారు. నిన్న విడుదలైన IBPS ఫలితాల్లోనూ PO క్యాడర్ ఉద్యోగాన్ని ఒడిసిపట్టారు. అయితే పోస్టు కేటాయించిన ప్రదేశం, ఇతర కారణాలతో ఏ జాబ్‌లోనూ చేరలేదట. నిత్య సాధనతో SSCలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.
Similar News
News November 8, 2024
‘జమాతే’ మద్దతుతో ప్రియాంక పోటీ: విజయన్
కాంగ్రెస్ పార్టీపై కేరళ CM విజయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వయనాడ్ బై ఎలక్షన్‌లో ప్రియాంకా గాంధీ వాద్రా నిషేధిత జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ లౌకిక ముసుగును బట్టబయలు చేసిందన్నారు. జమాతే సిద్ధాంతం మన ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా? ఈ విషయంలో INC వైఖరేంటి? అని నిలదీశారు. ఈ ఉప ఎన్నికలో సీపీఐ నుంచి సత్యన్, బీజేపీ నుంచి నవ్యా హరిదాస్ పోటీ పడుతున్నారు.
News November 8, 2024
జగన్ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని బయట పెడుతున్నారు: జీవీ
APలో నేరాలు తగ్గి శాంతి నెలకొనాలంటే జగన్‌నే అరెస్ట్ చేయాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. డీజీపీని బెదిరించడం చూస్తుంటే జగన్ తన క్రిమినల్, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారని అన్నారు. రౌడీలను రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్లు, హంతకులను జైళ్లకు పంపిస్తే YCP దాదాపు ఖాళీ అవుతుందని చెప్పారు.
News November 8, 2024
AMUపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
UPలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం AMUకి మైనార్టీ హోదా కొనసాగించవచ్చని CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 4:3తో తీర్పు ఇచ్చింది. రెగ్యులర్ బెంచ్ ఈ అంశంపై తుది తీర్పు ఇస్తుందని పేర్కొంది. 1875లో ప్రారంభించిన ఈ సంస్థ 1920లో సెంట్రల్ యూనివర్సిటీగా మారగా, ఆ తర్వాత 1951లో ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెందింది.