News August 26, 2025

అనకాపల్లి: దరఖాస్తు చేసుకునే గడువు పెంపు

image

జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్‌ తెలిపారు. ఆసక్తి గలవారు రూ.5 లక్షల నాన్ రెఫండబుల్ దరఖాస్తు రుసుము, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలన్నారు. 30న కలెక్టరేట్లో డ్రా ద్వారా బార్లు కేటాయించడం జరుగుతుందన్నారు.

Similar News

News August 27, 2025

నంద్యాల: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

image

నంద్యాల, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీ, దొంగతనాల కేసులలో దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బండి ఆత్మకూరు, పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు, 21 తులాల వెండి నగలు, రూ.10,100 నగదు, 2 బైకులు, 4 పిడిబాకులు, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

News August 27, 2025

ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్ టేలర్ స్విఫ్ట్

image

ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నారు. NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు IGలో పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్‌గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.

News August 27, 2025

600 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలు: ADB SP

image

గణపతి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన పట్టణాలలో క్లస్టర్లు, సెక్టర్లు వారీగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 షిఫ్టుల్లో నిరంతరం గస్తీతో పర్యవేక్షిస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 600 మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వివరించారు.