News April 2, 2024
వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7240
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా.. మంగళవారం రూ.7240 పలికింది. అయితే పత్తి ధరలు పెరిగేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి సరైన ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 15, 2025
ఐనవోలు జాతరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన MLA
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
News January 15, 2025
వరంగల్: పండుగ పూట విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్‌పల్లి గ్రామంలో పండుగ రోజు విషాదం నెలకొంది. కుటుంబీకుల వివరాలు.. గ్రామానికి చెందిన మౌనిక(30) గుండె పోటుతో మంగళవారం మృతి చెందింది. ఈ ఆకస్మిక ఘటనతో పండుగవేళ కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది. మౌనిక మృతి పట్ల పలువురు గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.
News January 15, 2025
విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.