News August 26, 2025

కడప: ‘బార్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు’

image

కడప జిల్లాలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 29వ తేది వరకు పొడిగించినట్లు జిల్లా ప్రాహిబిషన్ & ఎక్సైజ్ అధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2లో కలిపి మొత్తం 29 బార్ల ఏర్పాటుకు అధికారులు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు.

Similar News

News August 27, 2025

కడప: 27 బార్లకు 7 బార్లకే దరఖాస్తులు

image

కడప జిల్లాలో జనరల్ కేటగిరిలో 27 బార్ల ఏర్పాటుకు అధికారులు ఈనెల 18న దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకు ఇవాళ్టితో ముగియగా ఈ నెల 29 వరకు పొడగించారు. ఈ రోజుకి 27కు గాను 7బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ప్రొద్దుటూరులో 4 బార్లకు, కడపలో 2 బార్లకు, బద్వేల్‌లో 1 బార్‌కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురంలో బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.

News August 26, 2025

DJ.. సందిగ్ధంలో కడప జిల్లా వాసులు

image

వినాయక పండుగ సందర్భంగా కడప జిల్లా వాసులు DJ విషయంలో సందిగ్ధంలో పడ్డారు. DJలకు ఎటువంటి పర్మిషన్ లేదని ఇప్పటికే ఎస్పీ కార్యాలయం తెలిపింది. అయితే ఇవాళ కడప జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. DJలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని, నిబంధనలు ఎక్కువగా లేకుండా పర్మిషన్లు ఇవ్వాలన్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వినాయక మండపాల నిర్వాహకులు అయోమయంలో పడ్డారు.

News August 26, 2025

కడప జిల్లాలో సీఐల బదిలీ ఇలా

image

➤తిమ్మారెడ్డి: అన్నమయ్య TO ప్రొద్దుటూరు 1టౌన్
➤రామకృష్ణారెడ్డి: ప్రొద్దుటూరు 1టౌన్ TO కడప రిమ్స్
➤సీతారామిరెడ్డి: కడప రిమ్స్ TO పులివెందుల అర్బన్
➤చాంద్ బాషా: పులివెందుల TO నంద్యాల సైబర్ క్రైం
➤వంశీధర్: నంద్యాల సైబర్ TO ఖాజీపేట
➤మోహన్: ఖాజీపేట TO కడప వీఆర్
➤నాగభూషణం: సీకేదిన్నెTO ప్రొద్దుటూరు రూరల్
➤బాల మద్దిలేటి: ప్రొద్దుటూరు రూరల్ TO సీకేదిన్నె