News August 26, 2025

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించాలి: కలెక్టర్

image

మహిళలు వివిధ రంగాలలో స్వయం ఉపాధి పొందేలా అవసరమైన శిక్షణలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సారంగాపూర్ మండలం చించోలి సమీపంలోని మహిళా ప్రాంగణంలో జరుగుతున్న శిక్షణలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.

Similar News

News August 27, 2025

వినాయక చవితి.. మెదక్ ఎస్స్పీ కీలక సూచనలు

image

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలని సూచించారు.

News August 27, 2025

44 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం

image

పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు లక్ష్మీనారాయణ. సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లెకు చెందిన లక్ష్మీనారాయణ 44 ఏళ్ల వయసులో తాజాగా విడుదలైన డీఎస్సీ ఫలితాలలో రెండు విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీజీటీ హిందీ విభాగంలో 76.31 మార్కులతో 45 జోనల్ ర్యాంక్, ఎస్ఏ హిందీ విభాగంలో 69.31 మార్కులతో జిల్లా స్థాయి 65వ ర్యాంక్ సాధించినట్లు ఆయన తెలిపారు.

News August 27, 2025

అప్పుడే రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్

image

ఇంగ్లండ్ క్రికెటర్ రూట్ పెద్ద ప్లేయర్ అవుతారని 2012లో అనుకున్నట్లు సచిన్ చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలి టెస్ట్ ఆడుతున్న రూట్‌ను చూసి ఇంగ్లండ్ భవిష్యత్తు కెప్టెన్ అని సహచరులతో చెప్పినట్లు రెడిట్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఆయన స్ట్రైక్ రొటేట్ చేసే విధానం ఆకట్టుకుందని చెప్పారు. టెస్టుల్లో 13వేల పరుగులు చేయడం అద్భుతమని కొనియాడారు. ఈ ఫార్మాట్‌లో సచిన్ రికార్డుకు రూట్ ఇంకా 2,379 పరుగుల దూరంలో ఉన్నారు.