News August 26, 2025
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: ఖమ్మం కలెక్టర్

మహిళలు లాభసాటి వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం కావాలని, మరొకరికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం నగరం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా, శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంను సందర్శించారు. మహిళా ప్రాంగణం పరిసరాలను కలియ తిరిగిన కలెక్టర్, ప్రాంగణానికి కావలసిన మౌళిక సదుపాయాల గురించి మహిళా ప్రాంగణం మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 27, 2025
పంట నమోదు సక్రమంగా చేపట్టాలి: ఖమ్మం DAO

పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటల సాగు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించాలన్నారు. రైతులు పంటల సాగు వివరాలు నమోదు చేయించకపోతే ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
News August 27, 2025
ఇండోర్ తరహాలో ఖమ్మంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్

ఖమ్మం నగరంలో త్వరలో ప్లాస్టింగ్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రారంభిస్తామని నగర మేయర్ నీరజ అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలు చేస్తున్న ఆధునిక వ్యర్థ నిర్వహణ విధానాలు ఖమ్మంలో కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.
News August 26, 2025
మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు: ఖమ్మం సీపీ

త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం అలవర్చుకోవచ్చని పోలీసు అధికారులకు సూచించారు. మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలు, మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేసులకు సంబంధించి న్యాయస్థానంలో శిక్షలు పడేలా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.