News April 2, 2024
జనసేనకు షాకిచ్చిన ఈసీ

AP: ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఈసీ విడుదల చేసింది. ఇందులో జనసేనకు షాకిచ్చింది. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, వైసీపీకి, రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేనకు చోటు కల్పించింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు(జనసేన గుర్తు) ఉంది. దీంతో న్యాయనిపుణులతో జనసేన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Similar News
News March 21, 2026
ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.
News March 21, 2026
ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.
News March 21, 2026
జాగ్రత్త.. రేపు పిడుగులతో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఉ.గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. TGలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.


