News August 26, 2025

రాష్ట్రంలో పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ: మంత్రి

image

ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ పొర్లుకట్ట వద్ద మంత్రి మంగళవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం వారికి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News August 27, 2025

చవితి వేడుకలకు పటిష్ట బందోబస్తు: SP

image

వినాయక చవితిని ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలని SP కృష్ణ కాంత్ ప్రజలకు సూచించారు. పోలీస్ శాఖ సూచనలు, ఆదేశాలు తప్పని సరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.

News August 26, 2025

నెల్లూరు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో?

image

నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టుతారు, అసలు అధిష్ఠానం మనసులో ఎవరున్నారో? అని ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం అనుభవం, విధేయత తదితర అంశాలకు లోబడి చేస్తుందా లేదా అని పార్టీ నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ పదవి కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ అంశానికి తెరపడనుంది.

News August 26, 2025

నేడు నెల్లూరుకు త్రిసభ్య కమిటీ రాక

image

నేడు నెల్లూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో TDP విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. TDP జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. అబ్దుల్ అజీజ్ మరోసారి అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చెంచల్ బాబు యాదవ్ తదితరులు పదవిని ఆశిస్తున్నట్లు సమచారం.