News August 26, 2025
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు అనుమతి

TG: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. 2020 OCT 12 నుంచి NOV 10 వరకు స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అంగీకారం తెలిపింది. 2020 OCTలో అప్పటి ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు GO ఇవ్వగా, నెల రోజులకే కోర్టు స్టే విధించింది. చట్టంలో అవకాశం లేకుండా ఎలా రెగ్యులరైజ్ చేస్తారని ప్రశ్నించింది. ‘భూ భారతి’ చట్టంలో సాదాబైనామాల రెగ్యులరైజేషన్ అంశం పొందుపరచడంతో అనుమతి లభించింది.
Similar News
News August 27, 2025
టిష్యూ, యాపిల్స్‌తో వినాయకులు.. చూశారా?

వినాయక విగ్రహాల తయారీలో పలువురు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 1,500 కేజీల యాపిల్స్‌తో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పండ్లతో గణేషుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో టిష్యూ పేపర్లతో పర్యావరణహిత విగ్రహాన్ని తయారు చేశారు. 350 కేజీల టిష్యూతో 16 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.
News August 27, 2025
అప్పుడే రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్

ఇంగ్లండ్ క్రికెటర్ రూట్ పెద్ద ప్లేయర్ అవుతారని 2012లో అనుకున్నట్లు సచిన్ చెప్పారు. నాగ్‌పూర్‌లో తొలి టెస్ట్ ఆడుతున్న రూట్‌ను చూసి ఇంగ్లండ్ భవిష్యత్తు కెప్టెన్ అని సహచరులతో చెప్పినట్లు రెడిట్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఆయన స్ట్రైక్ రొటేట్ చేసే విధానం ఆకట్టుకుందని చెప్పారు. టెస్టుల్లో 13వేల పరుగులు చేయడం అద్భుతమని కొనియాడారు. ఈ ఫార్మాట్‌లో సచిన్ రికార్డుకు రూట్ ఇంకా 2,379 పరుగుల దూరంలో ఉన్నారు.
News August 27, 2025
ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.