News August 27, 2025

TODAY HEADLINES

image

* బిహార్: రాహుల్ యాత్రలో పాల్గొన్న CM రేవంత్
* బ్యాంకులు ప్రజలను నియంత్రించొద్దు: సీఎం చంద్రబాబు
* APSRTC ఉద్యోగుల ప్రమోషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్
* యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్ సింగ్
* రేవంత్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్
* రైతులకు గౌరవం దక్కాలి.. ఇబ్బందులు కాదు: కేటీఆర్
* పెరిగిన బంగారం ధరలు

Similar News

News August 27, 2025

ఓటీటీలోకి వచ్చేసిన ‘కింగ్డమ్’

image

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలో ‘సామ్రాజ్య’గా స్ట్రీమింగ్ అవుతోందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. గత నెల 31న విడుదలైన ఈ చిత్రం 28 రోజుల్లోనే OTTలోకి రావడం గమనార్హం. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

News August 27, 2025

ట్రంప్ టారిఫ్స్ ఉ.9.30 గంటల నుంచి అమల్లోకి..

image

భారత్‌పై ట్రంప్ విధించిన 25%(మొత్తం 50%) అదనపు టారిఫ్స్ ఇవాళ ఉ.9.30 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మన దేశం నుంచి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. రొయ్యలు, చెప్పులు, ఆభరణాలు, జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. మెడిసిన్స్, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు లభించనుంది.

News August 27, 2025

గణేశ్ మండపాలకు హైకోర్టు మార్గదర్శకాలు

image

TG: గణేశ్ మండపాల వద్ద సాయంత్రం 6-10 గంటల వరకే సౌండ్ సిస్టమ్ అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. సౌండ్ డెసిబుల్ స్థాయి దాటకుండా చెకింగ్ మీటర్లతో పర్యవేక్షించాలని సూచించింది. ఆసుపత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాల వైపు స్పీకర్లు పెట్టరాదని, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ప్రజల విజ్ఞప్తులు, సమస్యలను దృష్టిలో పెట్టుకొని విగ్రహాల ఏర్పాటుకు అనుమతులివ్వాలని అధికారులు, పోలీసులకు సూచించింది.