News August 27, 2025
NZB: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్‌పల్లి ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 19-45 సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి డిచ్‌పల్లిలోని RESTI ఆఫీసును సంప్రదించాలన్నారు.
Similar News
News August 27, 2025
బార్ లైసెన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు: ఆవులయ్య

నూతన బార్ పాలసీ 2025-28 కింద బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 29 వరకు పొడిగించినట్లు జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ అధికారి ఆవులయ్య తెలిపారు. లాటరీ డ్రా తేదీని ఆగస్టు 30 ఉదయం 8 గంటలకు మార్చినట్లు ఆయన చెప్పారు. ఏలూరు కలెక్టర్ ఆధ్వర్యంలో గోదావరి కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ లాటరీ నిర్వహించబడుతుందన్నారు.
News August 27, 2025
ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచనలు పాటించాలి: SP

జిల్లాలోని వినాయక మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100, 112 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. మండపాల ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News August 27, 2025
VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.