News August 27, 2025

బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే భవిష్యత్: ఎస్పీ

image

విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలిగితేనే భవిష్యత్ బంగారుమయం అవుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరు కిట్స్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగంపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవరాదని సూచించారు. ర్యాగింగ్, డ్రగ్స్ వాడకం జీవితాలను నాశనం చేస్తాయని, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

Similar News

News August 27, 2025

గుంటూరులో బార్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

News August 27, 2025

అమరావతి ORRకు భూసేకరణ ప్రారంభం

image

వట్టిచెరుకూరు, చేబ్రోలు సమీప గ్రామాలలో అమరావతి ORR భూసేకరణ ప్రారంభమైంది. కేంద్రం ఆమోదంతో వెడల్పు 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెరిగింది. ఇది అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలిలను రెండు లింక్ రోడ్లతో కలుపుతుంది. అమరావతికి వడ్డాణంలా ఈ రింగ్ రోడ్డు ఏర్పడనుంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం మొత్తం రూ.16,310 కోట్లుగా అంచనా వేశారు.

News August 27, 2025

తెనాలి: సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రాకు అరుదైన గౌరవం

image

తెనాలికి చెందిన సినీ మాటల రచయిత, నంది అవార్డు గ్రహీత సాయి మాధవ్ బుర్రా ‘సినీ సంభాషణా శిల్పి’ బిరుదును పొందారు. అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 24న తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినిధులు సాయి మాధవ్ కు ఈ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. తెనాలిలో కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే రంగస్థలం నటుడిగా గుర్తింపు పొందారు. RRR సహా పలు సినిమాలకు సంభాషణలు రాసిన సాయి మాధవ్ నంది అవార్డులు కూడా పొందారు.