News August 27, 2025
అన్ని సదుపాయాలతో పీహెచ్సీలు సిద్ధం చేయండి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపిఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. పీహెచ్సీల ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సకల సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేలా ఆసుపత్రులను తీర్చిదిద్దాలన్నారు. పనులపురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు నివేదించాలని ఆదేశించారు.
Similar News
News August 27, 2025
వినాయక చవితికి పటిష్టమైన భద్రత: ఎస్పీ

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జిల్లా ప్రజలను ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ప్రజల జీవితాల్లో అన్ని శుభాలు కలగాలని, వారి కార్యాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
News August 27, 2025
VZM: ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’

విజయనగరంలోని ఓ హోటల్లో టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఫరూఖ్, ఎమ్మెల్యే గణబాబు సభ్యులుగా వ్యవహారించి నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరారు.
News August 27, 2025
VZM: ‘బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించండి’

నిర్మాణాలు పూర్తయిన MPFC (మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్) గోదాముల బిల్లులు చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలు పూర్తయిన 11 గోదాములకు చివరి పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. పనులు మొదలుకాని గోదాములకు అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు.