News August 27, 2025
కుల్కచర్ల: అక్రమ రిజిస్ట్రేషన్‌తో మోసం.. ముగ్గురి అరెస్ట్

కుల్కచర్లలో అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్ పేరుతో మోసానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులైన కలకొండ మనోజ్ కుమార్, గడుల గణేష్, మురళి నాయక్ ఒక రైతును నమ్మించి మోసపూరితంగా 1 ఎకరా 16 గుంటల భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రైతుకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తేలింది. నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
Similar News
News August 27, 2025
సిద్దిపేట: చరిత్రలో చీకటి రోజు.. 84 మంది మృతి

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న బైరాన్‌పల్లికి చరిత్రలో ఒక రక్తపు పేజీ ఉంది.. పూర్వపు WGL మద్దూరు(M)లోని ఈ గ్రామం 1948 ఆగస్టు 27న రజాకార్ల క్రూరత్వానికి వేదికైంది. గ్రామస్థుల పోరాట పటిమ చూసి భయపడిన రజాకార్లు ప్రతీకారంతో గ్రామంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నిజాం సైన్యం 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ఈ ఊచకోత తెలంగాణ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలింది.
News August 27, 2025
గుంటూరులో బార్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.
News August 27, 2025
శ్రీ సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కడప జిల్లా కొండాపురం(M) లావనూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా వాసులు ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యల్లనూరు మండలం దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్‌లో పనిచేసి తిరిగి బైక్‌పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. కిందపడిపోగా ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టడంతో శివకుమార్(29), అంజనేయులు(27) మృతిచెందారు.