News August 27, 2025
ఆగస్టు 27: చరిత్రలో ఈ రోజు

1908: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం(ఫొటోలో)
1957: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జననం.
1963: నటి సుమలత జననం.
1972: రెజ్లర్ గ్రేట్ ఖలీ జననం.
2010: తెలుగు వైద్యుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం
Similar News
News August 27, 2025
సిద్దిపేట: చరిత్రలో చీకటి రోజు.. 84 మంది మృతి

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న బైరాన్‌పల్లికి చరిత్రలో ఒక రక్తపు పేజీ ఉంది.. పూర్వపు WGL మద్దూరు(M)లోని ఈ గ్రామం 1948 ఆగస్టు 27న రజాకార్ల క్రూరత్వానికి వేదికైంది. గ్రామస్థుల పోరాట పటిమ చూసి భయపడిన రజాకార్లు ప్రతీకారంతో గ్రామంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నిజాం సైన్యం 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ఈ ఊచకోత తెలంగాణ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలింది.
News August 27, 2025
ఇందిరమ్మ ఇళ్లకు రూ.1,000 కోట్లు చెల్లింపు: అధికారులు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,000 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2.04 లక్షల ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. గత 3 నెలలుగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన 15 రోజుల్లోపే బిల్లులు రిలీజ్ అయ్యేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
News August 27, 2025
బార్ అంటేనే బేర్‌మంటున్నారు!

APలో బార్‌ల నిర్వహణకు వ్యాపారులు ముఖం చాటేస్తున్నారు. నిన్నటివరకు 80% బార్‌లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇందుకు కొత్త బార్ పాలసీ నిబంధనలే కారణమని తెలుస్తోంది. రూ.99కి లభించే క్వార్టర్‌ను బార్‌లలో అమ్మేందుకు అనుమతి ఇవ్వకపోవడం, మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బార్లకు పెద్ద దెబ్బ అని వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో బార్‌ల లైసెన్స్ గడువును ఎక్సైజ్ శాఖ <<17524953>>పొడిగించింది<<>>.