News August 27, 2025

పంచాయతీలకు రూ.1,120 కోట్ల విడుదలకు సీఎం హామీ: పవన్

image

AP: సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నట్లు Dy.CM పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రూ.1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

Similar News

News August 27, 2025

భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు?

image

సిమెంట్ ధరలు భారీగా పెంచేందుకు కంపెనీలు, వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బస్తాకు రూ.30-40 వరకు పెంచే అవకాశమున్నట్లు సమాచారం. త్వరలో కేంద్రం జీఎస్టీ శ్లాబులు తగ్గించనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28% GST 18 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనాలకు ఊరట కలగకుండా తమ లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు ముందుగానే ధరలు పెంచుతున్నట్లు సమాచారం.

News August 27, 2025

ఇందిరమ్మ ఇళ్లకు రూ.1,000 కోట్లు చెల్లింపు: అధికారులు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,000 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2.04 లక్షల ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. గత 3 నెలలుగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన 15 రోజుల్లోపే బిల్లులు రిలీజ్ అయ్యేలా చూస్తున్నామని పేర్కొన్నారు.

News August 27, 2025

బార్ అంటేనే బేర్‌మంటున్నారు!

image

APలో బార్‌ల నిర్వహణకు వ్యాపారులు ముఖం చాటేస్తున్నారు. నిన్నటివరకు 80% బార్‌లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇందుకు కొత్త బార్ పాలసీ నిబంధనలే కారణమని తెలుస్తోంది. రూ.99కి లభించే క్వార్టర్‌ను బార్‌లలో అమ్మేందుకు అనుమతి ఇవ్వకపోవడం, మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం బార్లకు పెద్ద దెబ్బ అని వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో బార్‌ల లైసెన్స్ గడువును ఎక్సైజ్ శాఖ <<17524953>>పొడిగించింది<<>>.