News August 27, 2025
నంద్యాల: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

నంద్యాల, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీ, దొంగతనాల కేసులలో దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బండి ఆత్మకూరు, పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు, 21 తులాల వెండి నగలు, రూ.10,100 నగదు, 2 బైకులు, 4 పిడిబాకులు, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News August 27, 2025
కామారెడ్డి: ‘ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం’

ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం సమష్టిగా పోరాడాలని ఎంప్లాయీస్ JAC కామారెడ్డి జిల్లా ఛైర్మన్, TNGO జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో TGEJAC విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. న్యాయమైన హక్కులు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
News August 27, 2025
ఖమ్మం ఉపాధ్యాయుడికి 6 నెలల జైలు శిక్ష

చెల్లని చెక్కు కేసులో ఖమ్మంకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్తుపల్లి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. కల్లూరుకు చెందిన రామనరసింహారావు వద్ద ఉపాధ్యాయుడు జయరాజు 2015లో రూ.8.5 లక్షలు అప్పు తీసుకున్నారు. 2016లో తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లలేదు. దీంతో రామనరసింహారావు కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం జడ్జి ఈ తీర్పు ఇచ్చారు.
News August 27, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భాద్రపద మాసం చవితి తిథి బుధవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులున్నారు.