News August 27, 2025
స్టే.ఘ: యూరియా కోసం షాప్‌ల ముందు రైతుల పడిగాపులు

మునిగినా, తేలినా భూమినే నమ్ముకునే రైతులు ఎకరం సాగు చేయాడానికి నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు సాగు కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. సాగు నీటి సమస్య, కూలీల సమస్య, గిట్టుబాటు ధర సమస్యతో పాటు ప్రభుత్వం స్పందిస్తే పరిష్కారం అయ్యే యూరియా సమస్యతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం స్టే.ఘ. మండల శివునిపల్లిలో ఉదయం ఫర్టిలైజర్ షాప్ తీయకముందే షాపు ముందు వర్షం పడుతున్నా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాశారు.
Similar News
News August 27, 2025
పంచముఖ నాగేంద్రుడి నీడలో ఖైరతాబాద్ బడా గణేశ్

ఖైరతాబాద్‌లోని బడా గణేశ్‌కు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేసి 2 నెలల పాటు 150 మంది కళాకారులతో కలిసి మహాగణపతి రూపాన్ని తీర్చిదిద్దామని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. 3 ముఖాలతో, పంచముఖ నాగేంద్రుడి నీడలో నిలబడి ఉన్న ఆకారంలో లంబోధురుడని మట్టితో రూపొందించామని, ఆ మహారూపాన్ని ఆద్యంతం అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
News August 27, 2025
NLG: సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం

సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వరుసగా గేట్లను మూసివేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్లకు గాను 12 క్రస్ట్ గేట్లను మూసి వేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,61,971 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువ కృష్ణానదిలోకి స్పిల్వే మీదుగా 1,07,338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
News August 27, 2025
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: ఎస్ఈ

గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు విద్యుత్ కనెక్షన్ విషయంలో స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మండపాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.