News August 27, 2025

ప్రజా సమస్యలు మీడియా వెలికి తీయాలి: MP రఘునందన్

image

ప్రజా సమస్యలను మీడియా వెలికి తీసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా అవగాహన సదస్సులో అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలన్నారు. ఖచ్చితమైన సమాచారం సేకరించి వార్తలు రాయాలని సూచించారు.

Similar News

News August 27, 2025

ఏలూరు జిల్లాకు భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News August 27, 2025

అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!

image

అగ్రరాజ్యం అమెరికాను ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్లి (గాయాలైన చోటు నుంచి ప్రవేశిస్తుంది.) మాంసాన్ని తినేస్తుంది. దీంతో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. మేరీలాండ్‌లో తొలిసారిగా ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి వల్ల మనుషులకు ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.

News August 27, 2025

తిరుపతి TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా శ్రీధర్ వర్మ?

image

తిరుపతి TDP పార్లమెంట్ అధ్యక్షుడిగా బి.శ్రీధర్ వర్మ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. జోన్-4 మీడియా కోఆర్డినేటర్‌గా విస్మృత సేవలు అందించిన ఆయనకు జిల్లాలోని ఎక్కువమంది ఎమ్మెల్యేలు, నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. నిన్న మంత్రి సబితా నేతృత్వంలో జరిగిన కమిటీ సమావేశంలో పలువురు ఆశావాహులు బయోడేటాలు సమర్పించగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.