News August 27, 2025
ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.
Similar News
News August 27, 2025
అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!

అగ్రరాజ్యం అమెరికాను ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్లి (గాయాలైన చోటు నుంచి ప్రవేశిస్తుంది.) మాంసాన్ని తినేస్తుంది. దీంతో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. మేరీలాండ్‌లో తొలిసారిగా ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి వల్ల మనుషులకు ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.
News August 27, 2025
వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్?

TG: స్థానిక ఎన్నికల షెడ్యూల్ SEP తొలి వారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. SEC <<17525625>>ఆదేశాల<<>> నేపథ్యంలో ఈ నెల 30న క్యాబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. ముందుగా MPTC, ZPTC ఎన్నికలను వచ్చేనెల చివరి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వారానికే అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. కాగా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
News August 27, 2025
భారీ వర్షం.. పండగ పనులకు ఆటంకం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలనుకున్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాల వల్ల మండపాలన్నీ తడిచి ముద్దయ్యాయి. పూజా సామగ్రి, ఇతర వస్తువుల కోసం బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ‘ఇవాళ ఒక్కరోజు వర్షాన్ని ఆపు గణపయ్యా’ అని భక్తులు వేడుకుంటున్నారు.